పాసుపోర్టు ఇంటర్వ్యూ కు వెళ్తున్నారా?..అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి ..ఆరోజు సేవలు బంద్

పాసుపోర్టు ఇంటర్వ్యూ కు వెళ్తున్నారా?..అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి ..ఆరోజు సేవలు బంద్

పాసుపోర్టు ఇంటర్వూకు వెళ్తున్నారా? అయితే మీకోసమే ఈ వార్త.. సికింద్రాబాద్  రీజినల్ పాస్ పోర్టు ఆఫీసులో వచ్చే వారం సేవలు బంద్ కానున్నాయి. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ కారణంగా అన్ని రకాల సేవలు నిలిపివేయనున్నారు. వచ్చే గురువారం(ఫిబ్రవరి 26) పాసుపోర్టు సేవలు నిలిపివేయనున్నారు. పాసుపోర్టుకోసం ఇంటర్వ్యూ కు వచ్చే వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని  డిప్యూటీ పాసుపోర్టు  ఆఫీసర్ ఎల్ శ్రీనివాస్ రావు విజ్ణప్తి చేశారు.    

సాధారణంగా సికింద్రాబాద్  రీజినల్ పాస్ పోర్టు ఆఫీసులో ప్రత్యేక వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ఉండవు.  దరఖాస్తు దారుులు తప్పనిసరిగా ఆన్ లైన్ లో అపాయింట్ మెంట్ తీసుకోవాలి. ప్రతి గురువారం ఉదయం 9.30గంటల నుంచి 12.30 గంటల వరకు ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు దరఖాస్తులు,  ఆన్ హోల్డ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించేందుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వచ్చే గురువారం (ఫిబ్రవరి  26)న ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ వర్క్ కారణంగా ఈ సేవలను నిలిపివేశారు. 

ఉత్తమ సేవలను అందించినందుకు గాను 2025 జూన్ లో సికింద్రాబాద్ రీజినల్ పాస్ పోర్టు ఆఫీసుకు జాతీయ అవార్డు వచ్చింది. న్యూఢిల్లీలో విదేశాంగ  సహాయ మంత్రి చేతుల  మీదుగా  ఈ  అవార్డు ప్రదానం చేశారు. అనేక సంస్కరణలతో ప్రజలకు సేవలందించారు. అందు లో గురువారం ఫిర్యాదుల కార్యక్రమం కూడా ఒకటి. పాసుపోర్టు సంబంధించి సమస్యలున్న దరఖాస్తు దారు ప్రతి గురువారం ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించింది.