రూ.150 కోట్ల బిట్ కాయిన్ స్కామ్ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్

రూ.150 కోట్ల బిట్ కాయిన్ స్కామ్ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్

ముంబై: రూ.150 కోట్ల బిట్ కాయిన్ స్కామ్ కేసులో బాలీవుడ్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఊరట దక్కింది. ముంబైలోని ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కోర్టు ఈ కేసులో రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు చేసింది. 

బిట్‌కాయిన్ స్కామ్ కేసు ఏంటంటే..?

బిట్‌కాయిన్ సంబంధిత పెట్టుబడి కుంభకోణం ద్వారా కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. భారీ లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడిదారులను మోసం చేసినట్లు పేర్కొంది. పెట్టుబడిదారుల డబ్బును  క్రిప్టోకరెన్సీ ద్వారా లాండరింగ్ చేసినట్లు ఆరోపించింది. 

ఈ మొత్తం నెట్‌వర్క్‌లో రాజ్ కుంద్రా పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ కేసులో అతడిని నిందితుడిగా చేర్చింది. ఈ స్కామ్‎లో అతడి పాత్ర ఏంటి.. ఏదైనా ఆర్ధిక ప్రయోజనం పొందాడా అన్న కోణంలో ఈడీ ఎంక్వైరీ చేస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించి.. అనేక డాక్యుమెంట్స్, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ముంబైలోని ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కోర్టులో రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం (ఫిబ్రవరి 20) ఈ పిటిషన్ విచారణ చేపట్టిన పీఎంఎల్ఏ కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.