యుద్ధ భయాల్లోనూ తగ్గిన గోల్డ్.. హైదరాబాదులో వెండి రేటు ఎలా ఉందంటే..?

యుద్ధ భయాల్లోనూ తగ్గిన గోల్డ్.. హైదరాబాదులో వెండి రేటు ఎలా ఉందంటే..?

అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అవ్వబోతోందంటూ భారీగా జరుగుతున్న ఊహాగానాల సమయంలో బంగారం రేట్లు తగ్గటం విశేషం. అంతర్జాతీయ ఒడిదొడుకుల వేళ నిన్న భారీగానే పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్ ఇవాళ నెమ్మదించాయి. దీంతో శుక్రవారం షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని మారిన రేట్లను గమనించండి.

ఫిబ్రవరి 20న బంగారం రేట్లు స్వల్ప తగ్గుదలతో వినియోగదారులకు ఊరటను అందించాయి. దీంతో ఫిబ్రవరి 19 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.32 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 617గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 315గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : మార్కెట్‌‌‌‌‌‌‌‌లో యుద్ధ భయాలు.. 1,400 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రూ.7.55 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

ఇక వెండి విషయానికి వస్తే అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో వెండి ఆచితూచి వ్యవహరిస్తోంది. అయితే శుక్రవారం ఫిబ్రవరి 20, 2025న వెండి రేటు ఎలాంటి మార్పులు లేకుండానే కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 70వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.270 వద్ద ఉంది.