రష్మిక మందన్న – విజయ్ దేవరకొండల వివాహ ఏర్పాట్లు స్పీడ్ అందుకున్నాయి. వచ్చే గురువారం, ఫిబ్రవరి 26న ఈ జంట ప్రైవేట్‌గా వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
ఈ ఏడాది అతిపెద్ద సెలబ్రిటీ ఈవెంట్‌లలో ఒకటిగా భావిస్తున్న ఈ పెళ్లిని పూర్తిగా గోప్యంగా నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భద్రతా పరమైన ఎలాంటి లోపాలు లేకుండా, ప్రైవసీ కాపాడేందుకు ఒక అంతర్జాతీయ భద్రతా సంస్థను నియమించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా ఈ వేడుక జరగనుంది. విశాలమైన ప్రాంగణం కారణంగా ప్యాలెస్ పరిసరాలను పూర్తిగా భద్రపరచేందుకు విదేశీ భద్రతా ఏజెన్సీని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. స్థానిక రాజస్థాన్ భద్రతా సిబ్బందితో సమన్వయం చేస్తూ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆ గ్లోబల్ సెక్యూరిటీ సంస్థ వివరాలు బయటపెట్టలేదు.
వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే హాజరుకానున్నారు. అలాగే, ఈ వేడుకను పూర్తిగా నిఘాలో ఉంచినట్లు సమాచారం. వెండర్లు, లాజిస్టిక్స్ బృందాలకు (వ్యాపార సంస్థలు) గోప్యతపై కఠిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫోన్‌లకు అనుమతి ఉండదు. వివాహాన్ని షూట్ చేసే టీమ్ కూడా NDAలు (Non-Disclosure Agreement)పై సంతకం చేసినట్లు సమాచారం.
రూ.60 కోట్ల భారీ OTT ఆఫర్ రిజెక్ట్?
ఈ వివాహానికి సంబంధించి మరో క్రేజీ న్యూస్ కూడా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం వివాహ వీడియో హక్కుల కోసం రూ.60 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. పెళ్లి వేడుకల పూర్తి చిత్రీకరణ, తెరవెనుక క్షణాలు, ప్రత్యేక ఇంటర్వ్యూలతో ఒక స్పెషల్ డాక్యుమెంటరీగా రూపొందించాలనే ప్రతిపాదన వచ్చిందని సమాచారం.
అయితే ఈ భారీ ఆఫర్‌ను విజయ్-రష్మిక జంట తిరస్కరించిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వివాహ జ్ఞాపకాలు వ్యక్తిగతమైనవి, అమూల్యమైనవని భావించి వాణిజ్య ప్రయోజనాల కంటే గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, నెట్ఫ్లిక్స్ డీల్ మాట్లాడినట్లుగా టాక్!
