ఈ పోలీస్కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

ఈ పోలీస్కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

ట్రాఫిక్ పోలీసులంటే వాహనాలకు ఫైన్లు వేయడం, సిగ్నల్ దాటితే ఫోటోలు కొట్టడం ఒకటే కాదు. రోడ్లపై వెళ్ళే వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఏపనైనా చేస్తామని నిరూపించారు కేపీహెచ్ బీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి.

 వర్షం కారణంగా ఆర్వోబీ ఫ్లైఓవర్ పై నీళ్లు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దింతో అక్కడే డ్యూటి చేస్తున్న కానిస్టేబుల్ స్వామి వెంటనే వరద నీరు వెళ్లేందుకు రూట్ క్లీయర్ చేశాడు.   కానిస్టేబుల్ చేసిన పనిని అభినందిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పొస్ట్ చేశారు నేటిజన్లు. దింతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.