హైదరాబాద్ ను కమ్మేసిన మేఘాలు.. కుండపోత వర్షం

హైదరాబాద్ ను కమ్మేసిన మేఘాలు.. కుండపోత వర్షం

హైదరాబాద్ సిటీని నల్లటి మేఘాలు కమ్మేశాయి.. మధ్యాహ్నం వరకు ఉక్కబోతతో ఉన్న వాతావరణం.. మధ్యాహ్నం 3 గంటలకు తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని కారు మబ్బులు కమ్మేశాయి.

జూబ్లీహిల్స్,బంజారహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్,నాంపల్లి, సికింద్రాబాద్, అల్వాల్, బాల్ నగర్,  బోయిన్ పల్లి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, లో వర్షం దంచి కొడుతోంది.  రోడ్లపై వర్షం నీళ్లు నిలిచిపోవడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. 

మరో మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణకు  రెయిన్ అలర్ట్ జారీ చేసింది IMD. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కొన్నిప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. పశ్చిమ,నైరుతి దిశల నుంచి ఈదురుగాలులు వీస్తున్నట్టు చెప్పారు. ఇవాళ, రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.