ఫాదర్స్ డే స్పెషల్.. తండ్రి రోజువారి పనులను షేర్ చేసిన ధోని కుమార్తె

ఫాదర్స్ డే స్పెషల్.. తండ్రి రోజువారి పనులను షేర్ చేసిన ధోని కుమార్తె

ఫాదర్స్ డే సంధర్బంగా భార‌త మాజీ సారథి ఎంఎస్ ధోని గారాల కూతురు జీవా తన తండ్రికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఖాళీ సమయంలో ధోని చేసే రోజువారి పనులవి. వీడియోలో భారత మాజీ కెప్టెన్ చుట్టూ పచ్చదనంతో కూడిన వాతావరణంలో రెండు కుక్కలతో ఆడుతూ కనిపించాడు.

జీవా.. ధోని, సాక్షిల ఏకైక కుమార్తె. ఈ జంటకు 2010లో వివాహం జరగ్గా.. 2015లో జీవా జన్మించింది. ఇక మహేంద్రుడి క్రికెట్ విషయాల విషయానికొస్తే, ధోని వయస్సు దృష్ట్యా అతను మరొక ఐపీఎల్ ఎడిషన్‌లో ఆడతారంటే సందేహించాల్సిందే. మోకాలి గాయంతో గడిచిన ఐపీఎల్ సీజన్‌లో దిగ్గజ క్రికెటర్ ఎంతో ఇబ్బంది పడ్డాడు. వికెట్ల నడుమ పరుగులు తీయడం ఇబ్బంది కావడంతో స్లాగ్ ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్ చేశాడు.14 మ్యాచ్‌ల్లో 220.25 స్ట్రైక్ రేట్‌తో పాటు 161 పరుగులు చేశాడు.