తెలంగాణలో త్వరలో 2 వేల 867డాక్టర్ పోస్టులు

తెలంగాణలో  త్వరలో 2 వేల 867డాక్టర్ పోస్టులు
  • ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు సర్కార్ అనుమతి 
  • ఈ నెలలో వరుసగా 4 నోటిఫికేషన్లు 
  • జులై చివరికల్లా రిక్రూట్ మెంట్ పూర్తి
  • అకడమిక్ మెరిట్ ఆధారంగానే పోస్టుల భర్తీ 

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ దవాఖాన్లు, మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. జులై చివరికల్లా రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలిసింది. దీంతో అధికారులు రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సిద్ధమవుతున్నారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 2,867 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే దశలవారీగా మొత్తం 4 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్షలేమీ ఉండవు. అకడమిక్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు టెంటెటివ్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారు చేసి, ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపించినట్టు తెలిసింది. 

ఈ షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 664 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 18న తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీని జులై 13వ తేదీకల్లా పూర్తి చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నారు. పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు, ఇతర దవాఖాన్లలో ఖాళీగా ఉన్న 443 సివిల్ అసిస్టెంట్ సర్జన్(ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పోస్టులకు ఈ నెల 20న నోటిఫికేషన్ ఇచ్చి, జులై 18వ తేదీకల్లా భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని దవాఖాన్లలో ఖాళీగా ఉన్న 1,690 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పోస్టుల భర్తీకి ఈ నెల 25న నోటిఫికేషన్ ఇచ్చి, జులై 22వ తేదీకల్లా రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నారు. ఆయుష్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 70 ఆయుష్ లెక్చరర్ పోస్టులకు ఈ నెల 27న నోటిఫికేషన్ ఇచ్చి, జులై 22వ తేదీ నాటికి ప్రాసెస్ కంప్లీట్ చేయనున్నారు. డాక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక.. పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీని చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

ఏపీ విధానం అమలుపై కసరత్తు!

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొరతను అధిగమించేందుకు ఏపీ తరహా రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ విధానాన్ని అవలంబించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ చేసుకునేందుకు ఏపీ సర్కార్ అక్కడి అధికారులకు పర్మిషన్ ఇచ్చింది. డాక్టర్లెవరైనా ఉద్యోగం వదిలేసినా, రిటైర్ అయినా, కొత్త పోస్టులు వచ్చినా వెంటనే వాటిని రిక్రూట్ చేసుకునేందుకు అధికారులకు వెసులుబాటు కల్పించారు. అలాగే గ్రామీణ జిల్లాల్లోని‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీల్లో పనిచేసే టీచింగ్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అదనంగా 50 శాతం అలవెన్సులు ఇస్తున్నారు. మన దగ్గర ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి తదితర రూరల్ జిల్లాల్లోని కాలేజీల్లో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పని చేయడానికి డాక్టర్లు ముందుకు రావడం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదు. రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేసే వాళ్ల కంటే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న మెడికల్ కాలేజీల్లో పని చేసే వారికి ఎక్కువ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ, అలవెన్స్ లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ తరహా విధానాన్ని‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవేశపెడితే సత్ఫలితాలు వస్తాయని, అలాగైతేనే కొత్త కాలేజీలను నడపగలమని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించారు. ఈ ప్రతిపాదనలపై సర్కార్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది.