డిగ్రీ పరీక్షలో మారిన క్వశ్చన్ పేపర్..సెంటర్ వద్ద ఫస్టియర్ స్టూడెంట్ల ఆందోళన

డిగ్రీ పరీక్షలో మారిన క్వశ్చన్ పేపర్..సెంటర్ వద్ద ఫస్టియర్ స్టూడెంట్ల ఆందోళన

హైదరాబాద్, వెలుగు :  డిగ్రీ ఫస్టియర్ ఎగ్జామ్ నిర్వహిస్తున్న ఓ పరీక్షా కేంద్రంలో గందరగోళం నెలకొన్నది. ఓయూ పరిధిలోని నారాయణగూడలో ఉన్న తపస్య డిగ్రీ కాలేజీలో సోమవారం ఫస్టియర్ స్టూడెంట్లకు సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ క్వశ్చన్ పేపర్ అన్ని కోర్సులకు కామన్ పేపర్ గా ఇవ్వాల్సి ఉంది. కానీ, బీబీఏ సీబీసీఎస్, బిజినెస్ అనలిటిక్స్ కామర్స్ పేపర్లను స్టూడెంట్లకు అందించారు. క్వశ్చన్ పేపర్ పూర్తి డిఫరెంట్ గా ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

ఈ విషయాన్ని కాలేజీ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే, హాల్ టికెట్ ఉన్న పేపర్ కోడ్ ఆధారంగానే క్వశ్చన్ పేపర్లు ఇచ్చామని కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణాగౌడ్ తెలిపారు. ఘటనపై వెరిఫై చేస్తామని, విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని ఓయూ ఎగ్జామ్స్ కంట్రోలర్ రాములు పేర్కొన్నారు.