
హైదరాబాద్: కాంగ్రెస్ నేత, విజయశాంతి చేసిన ట్వీట్ ఇవాళ హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అంతరిస్తుందంటూ ఇటీవల బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను విభేదిస్తున్నట్టు చెప్పారు. దక్షిణాదిలో స్వీయ ఆత్మాభిమానానికే ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇందుకు దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుంచి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ వరకు నడుస్తున్న విధానాన్నే విశ్లేషించుకోవాలని పేర్కొన్నారు.
ప్రాంతీయ భావోద్వేగాలు ఉంటాయని వాటిని కాంగ్రెస్ మాత్రమే అర్థం చేసుకోగలదని పేర్కొన్నారు. ఇది దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ కనీసం ఆలోచించే స్థితిలో కూడా లేదని తెలిపారు. ఆమె ట్వీట్ పై నెటిజన్ల నుంచి మిక్స్ డ్ కామెంట్లు వస్తున్నాయి. ఇంతకూ మీరు ఏ పార్టీలో ఉన్నారు.. ఏం రాశారు..? అని ఒకరు ట్వీట్ చేస్తే...? మరొకరు మీరు ఏం రాశారో ఒక సారి చదువుకోండి అంటున్నారు. ఈ ట్వీట్ తో అక్క మళ్లీ బీఆర్ఎస్ లో చేరబోతుందా.? అనే డౌట్ వస్తోందని మరొకరు కామెంట్ చేశారు.