Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది

Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది

బాలీవుడ్ యాక్టర్ పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తూ..విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్(Criminal Justice).2019లో మొదలైన వెబ్ సిరీస్ తొలి సీజన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ఆడియన్స్కు సూపర్బ్ కిక్ ఇచ్చింది. ఇక వరసగా గడిచిన నాలుగేళ్లలో క్రిమినల్ జస్టిస్ సీజన్ 2, 3 రిలీజై మంచి హిట్ అందుకున్నాయి. దీంతో ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలోనే నాలుగో సీజన్ కూడా రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

అంతేకాదు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను ఇవాళ (మే 17) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disney plus Hotstar)రిలీజ్ చేసింది. దీనికి ''కోర్ట్ జారీ హై, ఔర్ నయే సీజన్ కి తయ్యారీ భీ. ఆ రహే హై మాధవ్ మిశ్రా, కే నయే సీజన్ కే సాథ్!'' అని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పోస్ట్‌కి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. అనగా.."కోర్టు నడుస్తోంది. అలాగే కొత్త సీజన్ కూడా సిద్ధమవుతోంది. హాట్‌స్టార్ స్పెషల్స్ క్రిమినల్ జస్టిస్ కొత్త సీజన్ తో మాధవ్ మిశ్రా వచ్చేస్తున్నాడు." అనే క్యాప్షన్ తో ఓ వీడియో పోస్ట్ చేసిందన్నమాట. 

ఈ మేరకు రిలీజ్ చేసిన వీడియో ఫన్నీగా సాగుతూ ఆసక్తికరంగా ఉంది. కోర్టులో ఓ కేసు నడుస్తున్న సమయంలోనే..కెమెరా మెల్లగా లోపలికి వస్తుంది. ఇక అదే టైంలో ఈ సిరీస్ లో అడ్వొకేట్ మాధవ్ మిశ్రా పాత్ర పోషించిన పంకజ్ త్రిపాఠీ ఓ కేసు సిన్సీయర్ గా వాదిస్తూ ఉంటాడు. సడెన్ గా కోర్టు రూంకి కెమెరా రావడం చూసి..ఏం చేస్తున్నారు..కోర్టు నడుస్తోంది.. వెళ్లండి..ఒక్క నిమిషం ఆగండి..నేను త్వరలోనే వస్తున్నాను.. అక్కడ తీరిగ్గా చూడండి..ఇప్పుడు వెళ్లండి అని అంటాడు. దీంతో ఈ సీజన్ 4 క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందో ఊహించుకోండి. 

క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ ఫస్ట్  సీజన్ 2019లోనే వచ్చింది. అందులో 12'th ఫెయిల్ యాక్టర్ విక్రాంత్ మస్సీ నటించాడు. తర్వాత క్రిమినల్ జస్టిస్ బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ పేరుతో వచ్చిన రెండో సీజన్లో లీడ్ రోల్ క్యారెక్టర్ లో నటి కీర్తి కుల్హరి నటించింది. ఇక మూడో సీజన్ కూడా 2022లోనే అధూరా సచ్ పేరుతో వచ్చింది.

ఈ మూడింటిలోను కథ, కథనాలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాయి. ముఖ్యంగా ఈ సిరీస్ లో ఆధారాలు లేకుండానే జైలు శిక్ష అనుభవిస్తున్న బాధితుల తరఫున పోరాడే అడ్వొకేట్ మాధవ్ మిశ్రాగా పంకజ్ త్రిపాఠీ నటించి మెప్పించాడు. మరి సీజన్ 4లో ఎలాంటి అధరాలు లేని కథతో వస్తున్నాడో తెలియాల్సి ఉంది.