Janaganamana: చివరికి తేజ సజ్జ చేతికి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇప్పటికైనా వర్కౌట్ అయ్యేనా!

Janaganamana: చివరికి తేజ సజ్జ చేతికి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇప్పటికైనా వర్కౌట్ అయ్యేనా!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో పూరి జగన్నాధ్(Puri Jagannadh) ఒకరు. ఆయన సినిమాలకు, ఆయన మేకింగ్ కి సెపరేట్ స్టైల్ ఉంది. కేవలం హీరోల క్యారెక్టరైజేషన్ మీద సినిమాలు చేసే ఏకైక డైరెక్టర్ అంటే పూరి అనే చెప్పాలి. అందుకే ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాదు.. సినిమా మొదలయ్యాక ఎప్పుడు విడుదల అవుతుందో తెలియాలని ఈ కాలంలో కూడా సినిమాను మొదలుపెట్టిన రోజే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే డైరెక్టర్ కూడా ఆయన. చాలా తక్కువ టైం పీరియడ్ లో సినిమా చేసి విడుదల చేయగల దర్శకుడు కూడా పూరినే.

అందుకే.. ఆయన క్రేజ్ కూడా హిట్స్ ప్లాప్స్ కి అతీతంగా ఉంటుంది. అయితే.. ఇన్ని సంవత్సరాల పూరి సినీ కెరీర్ లో ఆయన డ్రీం ఒకటి అలాగే మిగిలిపోతోంది. అదేంటంటే.. పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్టు జనగణమణ. అవును.. ఈ సినిమా చేయడం అనేది ఆయన డ్రీం అని పూరి చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఆ మధ్య మహేష్ బాబు హీరోగా ఈ సినిమా రానుందని వార్తలు వినిపించాయి. కానీ, అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. 

ఇక ఇటీవల లైగర్ సినిమా సమయంలో విజయ్ దేవరకొండతో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు. JGM అనే టైటిల్ తో పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ. లైగర్ భారీ డిజాస్టర్ అవడంతో ఆ సినిమా మళ్ళీ అటకెక్కింది. ఇక అప్పటినుండి ఆ ప్రాజెక్టు అలాగే మూలాన పడి ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి పూరి డ్రీం ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఈసారి జనగణమణ కథ కుర్ర హీరో తేజ సజ్జ వరకు వెళ్లిందట. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకున్న తేజ అయితే ఈ కథకు బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట పూరి. ఇదే విషయాన్నీ తేజ దగ్గర ప్రస్తావించగా ఒకే అన్నాడని, త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరి ఈసారైనా పూరి డ్రీం ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా అనేది చూడాలి.