V6 News

మైనార్టీ యూత్కు ఫ్రీ స్కిల్ ట్రైనింగ్.. నెలకు రూ.2 వేలు స్టైఫండ్

మైనార్టీ యూత్కు ఫ్రీ స్కిల్ ట్రైనింగ్.. నెలకు రూ.2 వేలు స్టైఫండ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: టెలికాం రంగంలో శిక్షణ, ఉద్యోగ అవకాశాల కోసం మైనార్టీ యువత దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఇలియా అహ్మద్ ఒక ప్రకటనలో కోరారు. భారత ప్రభుత్వ సహకారంతో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పీఎం వికాస్ స్కీం కింద అర్హత గల మైనారిటీ యువతకు ఉచితంగా స్కిల్ డెవలప్​మెంట్ ట్రైనింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రాడ్‌‌‌‌‌‌‌‌ బ్యాండ్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ టెక్నీషియన్ , వైర్లెస్ నెట్​వర్క్ టెక్నీషియన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.

 మే మొదటి వారం నుంచి ఈ ట్రైనింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.  ట్రైనింగ్ టైంలో నెలకు రూ. 2 వేల స్టైఫండ్​అందుతుందని తెలిపారు. https://tinyurl.com/pmvikas2026 లింక్ ద్వారా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 9441239704 ,  9493603090 నంబర్లలో సంప్రదించాలని కోరారు.