V6 News

రూ.100 కోట్ల కోసం వాటాలు అమ్మేసిన హైదరాబాద్‌‌‌‌ ప్యారడైజ్ బిర్యానీ

రూ.100 కోట్ల కోసం వాటాలు అమ్మేసిన హైదరాబాద్‌‌‌‌ ప్యారడైజ్ బిర్యానీ

ముంబై: హైదరాబాద్‌‌‌‌కు చెందిన పాపులర్ బిర్యానీ బ్రాండ్‌‌‌‌ ప్యారడైజ్‌‌‌‌ వాటాల అమ్మకంతో దాదాపు రూ.100 కోట్లు సేకరించేందుకు రెడీ అవుతోంది. ఈ నిధులను కొత్త ఔట్‌‌‌‌లెట్లను ఏర్పాటు చేయడానికి,  బిజినెస్‌‌‌‌ను విస్తరించడానికి వాడడనుంది. ప్రస్తుతం ఈ కంపెనీలో ప్రైవేట్‌‌‌‌ ఈక్విటీ సంస్థ సమారా క్యాపిటల్‌‌‌‌కు 100 శాతం వాటా ఉంది. ఇప్పుడు 10–12శాతం వాటాను అమ్మి,  కొత్త ఇన్వెస్టర్‌‌‌‌ను తీసుకురావాలని యోచిస్తోంది.  కంపెనీకి ప్రస్తుతం 60 ఔట్​లెట్లు ఉన్నాయి.