చైనా రోబోలపై అమెరికాలో బ్యాన్..జాతీయ భద్రతకు ప్రమాదమంటున్న యూఎస్

చైనా రోబోలపై అమెరికాలో బ్యాన్..జాతీయ భద్రతకు ప్రమాదమంటున్న యూఎస్

చైనా తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబోలను అమెరికా నిషేధించింది. ఈ రోబోలు దేశ భద్రతకు ప్రమాదం అని ఆరోపించింది.   నాలుగు కాళ్ల యానిమిల్స్, రెండు కాళ్ల యానిమల్స్, వీల్స్,  ట్రాక్ లు కలిగిన వెహికల్స్ తో సహా   లేటెస్ట్ డివైజ్ లను హ్యుమనాయిడ్ రోబోలకు గుర్తించింది.  టెలికమ్యూనికేషన్స్, డ్రోన్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు హ్యూమనాయిడ్  రోబోల వరకు వివి ధ రంగాలలో చైనా టెక్నాలజీపై యూఎస్ ప్రభుత్వం నియంత్రణ చర్యల్లో  భాగం గా ఈ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎలాన్ మస్క్ గతంలో చైనా హ్యూమనాయిడ్ రోబోట్‌లు టెస్లాకు అతిపెద్ద దీర్ఘకాలిక పోటీగా అభివర్ణించిన తర్వాత ఈ చ్యర్యలు తీసుకున్నారు ట్రంప్. 

అమెరికా ప్రభుత్వం చైనా తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబోలు, నాలుగు కాళ్ల రోబోలు, రెండు కాళ్ల రోబోలు, వీల్స్ లేదా ట్రాక్‌లపై నడిచే అధునాతన రోబోటిక్ పరికరాలపై నిషేధం విధించే దిశగా కీలక చర్యలు చేపట్టింది. ఈ పరికరాలు దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. టెలికమ్యూనికేషన్స్, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇప్పుడు రోబోటిక్స్ రంగంలోనూ చైనా టెక్నాలజీపై నియంత్రణలను మరింత కఠినతరం చేస్తోంది. 

అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) ప్రకారం.. ఆధునిక రోబోలు LiDAR, కెమెరాలు, స్పర్శ, ధ్వని, ఉష్ణోగ్రత సెన్సార్ పరిసరాలపై అత్యంత సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటా విదేశీ సంస్థలు లేదా ప్రభుత్వాల చేతికి వెళ్లే ప్రమాదం ఉండటంతో జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే విదేశీ తయారీ అధునాతన రోబోటిక్ పరికరాలపైకఠిన చర్యలు చేపట్టింది.

►ALSO READ | అమెరికా అధ్యక్షుడి చావు నుంచి పుట్టిన FBI.. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ దర్యాప్తు సంస్థగా ఎలా ఎదిగింది..?

ఇదే సమయంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా చైనా హ్యూమనాయిడ్ రోబోలు భవిష్యత్తులో టెస్లాకు అతిపెద్ద పోటీగా మారతాయని అన్నారు. టెస్లా ఆప్టిమస్ రోబోట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిగా మారే అవకాశం ఉందని, అయితే భారీ స్థాయి తయారీ సామర్థ్యం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీతో చైనా ఈ రంగంలో గట్టి పోటీ ఇస్తుంద ని అన్నరారు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామంతో  అమెరికా ప్రభుత్వం దేశీయ రోబోటిక్స్ పరిశ్రమను బలోపేతం చేయడంతో పాటు, చైనా టెక్నాలజీపై మరింత కఠిన నియంత్రణలు అమలు చేస్తోంది.