బొగ్గు కుంభకోణం కేసులో.. మరణించిన రెండేళ్ల తర్వాత.. మాజీ ప్రధానికి క్లీన్ చిట్

బొగ్గు కుంభకోణం కేసులో.. మరణించిన రెండేళ్ల తర్వాత.. మాజీ ప్రధానికి క్లీన్ చిట్

బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు క్లీన్ చిట్ లభించింది. మరణించిన రెండేళ్ల తర్వాత ఈ కేసులో ఆయనను  నిర్దోషి అని సుప్రీంకోర్టు  తీర్పు చెప్పింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో, అప్పటి ప్రధాని  మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖను నిర్వహించినప్పుడు  ఒడిశాలోని తలబీరా-II బొగ్గు బ్లాక్‌ను అక్రమంగా హిండాల్కో ఇండస్ట్రీస్‌కు కేటాయించారన్న ఆరోపణలతో  కేసు నమోదు  అయింది. అప్పట్లో ఈ కేసు  దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

2015లో వెలుగు చూసిన ఈ కేసులో సీబీఐ విచారణ ఆదేశించారు. పారిశ్రామిక వేత్త కుమార్ మంగళం బిర్లా , మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరాఖ్ లపై సీబీఐ చార్జీ షీట్ దాఖలు చేయగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా నిందితుడిగా  పిలిపించింది సుప్రీంకోర్టు. 

ఈ విషయంతో ట్రయల్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకోవడంలో పొరపాటు జరిగిందని,  మన్మోహన్ సింగ్  కోర్టు సమన్లను సుప్రీంకోర్టు లో సవాల్ చేశారు. అయితే 2015 ఏప్రిల్ లో సమన్లపై స్టే విధించిన సుప్రీంకోర్టు సింగ్ విచారణ ఎదుర్కొనకుండా  ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ అప్పీలు పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉండగా, 2024 డిసెంబర్‌లో మన్మోహన్ సింగ్ మరణించిన అనంతరం సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేసి, మాజీ ప్రధానిపై విచారణను ముగించింది.

మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో 2024 డిసెంబర్ 26న మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు న్యూఢిల్లీలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.