రూపాయి ఖర్చు లేకుండా వాట్సాప్ మరో సూపర్ ఫీచర్.. ఇక యాప్ లేకుండానే డైరెక్ట్ వీడియో కాల్స్ !

రూపాయి ఖర్చు లేకుండా వాట్సాప్ మరో సూపర్ ఫీచర్.. ఇక యాప్ లేకుండానే డైరెక్ట్ వీడియో కాల్స్ !

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం అదిరిపోయే కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. మంగళవారం (జూలై 28, 2026)న వాట్సాప్ ఈ అప్‌డేట్స్‌ను అధికారికంగా ప్రకటించింది. జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ లాంటి ప్రముఖ వీడియో కాల్ ప్లాట్‌ఫారమ్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా వాట్సాప్ ఈ మార్పులు చేస్తోంది.

ఈ కొత్త ఫీచర్ల గురించి:

1. వాట్సాప్ వెబ్ కాలింగ్ (WhatsApp Web Calling)
యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన పనిలేదు: ఇప్పటివరకు వాట్సాప్‌లో కాల్స్ మాట్లాడాలంటే మొబైల్ యాప్ లేదా డెస్క్‌టాప్ యాప్ ఉండాల్సి వచ్చేది. కానీ ఇకపై ఎలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోకుండానే, డైరెక్ట్  గూగుల్ క్రోమ్ లాంటి వెబ్ బ్రౌజర్ల ద్వారా వాట్సాప్ వెబ్‌లోనే ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడవచ్చు. ఆఫీస్ లాప్‌టాప్‌లలో యాప్‌లు ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతి లేని ఉద్యోగులకు, కాలేజీ విద్యార్థులకు లేదా షేర్డ్ కంప్యూటర్లు వాడేవారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. బ్రౌజర్ ద్వారా కాల్స్ చేసుకునేటప్పుడే స్క్రీన్ షేరింగ్, రియాక్షన్స్, కాల్ హిస్టరీ, ఫేవరెట్స్ ట్యాబ్ వంటి అన్ని ఫీచర్లను వాడొచ్చు.

2. కాల్ ట్రాన్స్‌ఫర్ (Call Transfer)
మనం మాట్లాడే గ్రూప్ కాల్ కట్ చేయకుండానే, ఆ కాల్‌ను ఒక డివైజ్ అంటే మొబైల్ నుండి మరో డివైజ్‌కు లేదా లాప్‌టాప్ కు ఎలాంటి బ్రేక్  లేకుండా మార్చుకోవచ్చు.

3. వెయిటింగ్ రూమ్ (Waiting Room)
జూమ్ లేదా గూగుల్ మీట్ లాగే వాట్సాప్ గ్రూప్ కాల్స్‌లోనూ 'వెయిటింగ్ రూమ్' ఫీచర్ రానుంది. దీనివల్ల గ్రూప్ కాల్స్‌లోకి ఎవరు రావచ్చో హోస్ట్  అప్రూవ్ చేయడానికి వీలవుతుంది.

4. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ సప్రెషన్ (Background Noise Suppression)
మనం ఎక్కడైనా రద్దీగా ఉండే లేదా శబ్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉండి కాల్ మాట్లాడినా, ఆ బ్యాక్ గ్రౌండ్ శబ్దాలను తగ్గించి అవతలి వారికి మన గొంతు స్పష్టంగా వినిపించేలా ఈ ఫీచర్ సహాయపడుతుంది.

ALSO READ : అమెరికా అధ్యక్షుడి చావు నుంచి పుట్టిన FBI.. 

అయితే ఈ వెబ్ కాల్స్ అన్నీ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సేఫ్ గా ఉంటాయి. ఈ సర్వీసెస్ అన్నీ ఎలాంటి కాలపరిమితులు (Time Limits) లేకుండా, పూర్తిగా ఫ్రీగా అందుబాటులో ఉంటాయి.