NRI ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానంటూ.. 9 కోట్ల రూపాయలకు మోసం చేసిన కేసులో నటి ఆషు రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు బిగ్ ట్విస్ట్. డబ్బుల విషయంలో జరిగిన వివాదంలో.. పెద్ద మనుషుల పంచాయితీకి సంబంధించి ధర్మేంద్రకు.. ఆషు రెడ్డి ఆడియో మెసేజ్ చేసింది. ఈ ఆడియో మీడియాకు లీక్ అయ్యింది. ఆషు రెడ్డి మాట్లాడుతూ.. పెద్ద మనుషుల పంచాయతీలో నీ వైపు వేణు స్వామిని తీసుకొస్తావా ఇంకెవరినైనా తీసుకొస్తావో నీ ఇష్టం అంటూ చెబుతోంది. ఆషు రెడ్డి మాత్రం తన తరపున సీరియల్ నటి ప్రవీణ వస్తారని చెబుతోంది. ఈ ఆడియోలో వేణు స్వామి పేరు ప్రస్తావించటం.. గతంలో ఆషు రెడ్డికి.. కామాఖ్య అమ్మవారి ఆలయంలో పూజలు చేయటం వంటి విషయాలు అన్నీ ఇప్పుడు తెరపైకి రావటంతో.. ఈ కేసు మరింత ఆసక్తిగా మారింది.
ధర్మేంద్రకు వాట్సాప్ ద్వారా ఆషు రెడ్డి ఈ ఆడియో పెట్టింది. నీ ముఖం చూడటం కూడా ఇష్టం లేదు అంటూ.. పెద్దల దగ్గర పంచాయితీ పెట్టి.. సమస్య పరిష్కరించుకుందాం అని చెబుతోంది.
మే నెల వరకు సమయం ఇస్తే.. కోటిన్నర రూపాయలు తిరిగి ఇస్తానని.. అది కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆ డబ్బులు ఇస్తానని చెబుతోంది. మే నెల అనేది ఒక్కటే నా టార్గెట్ గా కనిపిస్తుంది అంటూ చెబుతోంది ఆషు రెడ్డి.
మే నెలలో కోటిన్నర రూపాయలు తిరిగి ఇస్తానని చెప్పటం ద్వారా.. ధర్మేంద్ర దగ్గర డబ్బులు తీసుకున్నట్లు.. ఆషు రెడ్డి ఈ ఆడియోతో దొరికిపోయింది అంటున్నారు నెటిజన్లు.
అంతేనా.. మిగతా డబ్బులు జీవితంలో సెటిల్ అయినప్పుడు.. జీవితంలో సెటిల్ అయ్యి డబ్బులు సంపాదించినప్పుడు తిరిగి ఇస్తానని.. అది ఎప్పుడు అనేది చెప్పలేను.. డబ్బులు మాత్రం ఇస్తాను అంటూ ధర్మేంద్రకు పెట్టిన ఆడియోలో స్పష్టంగా చెబుతోంది ఆషు రెడ్డి.
పెద్దల దగ్గర పంచాయతీలో నా తరపున ప్రవీణక్క వస్తుందని.. నీ వైపు నుంచి వేణు స్వామి వస్తారో.. ఇంకెవరైనా వస్తారో నీ ఇష్టం అని అంటోంది ఆషు రెడ్డి. నా పర్మీషన్ లేకుండా నా ఇంటికి ఎందుకు వస్తావ్ అంటూ ప్రశ్నిస్తూనే.. నా ఇంట్లో వాళ్లను ఇన్వాల్వ్ చేస్తే కేసు పెడతానంటూ బెదిరించటం ఆడియోలో ఉంది.
నీ ముఖం కూడా చూడాలని అనుకోవటం లేదు.. ఈ విషయం గురించి నేరుగా మాట్లాడాలి అని అనుకోవటం లేదంటూ ఆషు రెడ్డి తన వాయిస్ మెసేజ్ పెట్టింది.
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఆ ఆడియోలో వేణు స్వామి పేరు ఉండటం ఆసక్తిగా మారింది. ఈ డబ్బుల వ్యవహారం వేణుస్వామికి ముందే తెలిసి ఉంటుంది.. వీళ్లిద్దరి పెళ్లికి జాతకాలు చూసింది వేణుస్వామినే అని స్పష్టం అవుతుంది.

