సామాన్యురాలిగా పోలీస్ స్టేషన్కు డీసీపీ

సామాన్యురాలిగా పోలీస్ స్టేషన్కు డీసీపీ
  • పంజాగుట్టలో సిబ్బంది పనితీరుపై శిల్పవల్లి ‘లైవ్ టెస్ట్’

పంజాగుట్ట, వెలుగు: సాధారణంగా ఉన్నతాధికారులు అంటే ఏసీ గదులు, కాన్వాయ్​లు, హుందాగా ఇచ్చే ఆదేశాలే గుర్తొస్తాయి. కానీ ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పావల్లి మాత్రం తన రూట్ సెపరేటని నిరూపించారు. సిబ్బంది పనితీరును స్వయంగా పరీక్షించేందుకు ఆమె ఒక సామాన్య మహిళా ఫిర్యాదుదారుగా పోలీస్ స్టేషన్​కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. గురువారం రాత్రి తన వాహనాన్ని పంజాగుట్ట పోలీస్​స్టేషన్​కు అర కిలోమీటర్​ దూరంలో నిలిపి మఫ్టీలో స్టేషన్​కు వెళ్లారు.

పేరు, ఫోన్ నంబర్ మార్చి ఫిర్యాదు ఇస్తుండడంతో ఎవరికీ అనుమానం కలగలేదు. శ్రీనగర్ కాలనీలో ఉంటానని తన సమస్యను వివరిస్తుండగా మహిళా సిబ్బంది గుర్తించి అలర్ట్ చేయడంతో అందరూ అలర్ట్ అయ్యారు. అనంతరం ఫిర్యాదుదారులతో పోలీస్​స్టేషన్​లో అందుతున్న సేవలు తీరును వాకబు చేశారు.