భారత్ కు చమురు, సహజవాయువును సరఫరా చేసేందుకు రష్యా ముందుకు వచ్చింది. భారత్ మార్కెట్ కు తగినంత చమురు, ఎల్ పీజీ గ్యాస్ సరఫరాను పెంచేందుకు రష్యా కంపెనీలు సిద్దంగా ఉన్నాయని స్పష్టం చేసింది.ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు,హార్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలతో చమురు, గ్యాస్, ఎరువుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ కు రష్యా అండగా ఉంటుందని తెలిపింది.
శుక్రవారం (ఏప్రిల్3) ప్రధానిమోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ తో రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటిరోవ్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇంధన, ఎరువులు వంటి కీలక రంగాలలో సహాకారం పెంపొందించే దిశగా చర్చలు జరిపారు. భారత్ కు మరింత చమురు, సహజవాయువును సరఫరా చేసేందుకు రష్యా సిద్దంగా ఉందని మంటురోవ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
►ALSO READ | దెబ్బ మీద దెబ్బ: F15 ఫైటర్ జెట్ తోపాటు.. అమెరికా సెర్చింగ్ హెలికాప్టర్ నేలమట్టం!
గత డిసెంబర్ లో అధ్యక్షుడు పుతిన్ న్యూఢిల్లీ పర్యటన, భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశంలో నిర్ణయించిన అంశాలను అమలు చేసేందుకు ఇరు దేశాలు చేస్తున్న ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. మాంటిరోవ్ తో సమావేశం అనంతరం జైశంకర్ మాట్లాడుతూ.. వాణిజ్యం, పరిశ్రమలు, ఇంధనం, ఎరుువులు, కనెక్టివిటీ, మొబిలిటీ రంగాలపై ఇరు దేశాలు పరస్పర సహాకారం దృష్టి సారించాయన్నారు.
2025 చివరి నాటికి ఖనిజ ఎరువుల సరఫరాను రష్యా 40% పెంచిందని, ఈ ఉత్పత్తి కోసం భారత్ అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉందని మాంటురోవ్ చెప్పారు. కార్బమైడ్ ఉత్పత్తి కోసం ఉమ్మడి ప్రాజెక్టును కూడా ఇరుపక్షాలు అభివృద్ధి చేస్తున్నాయని తెలిపారు. ఇటీవల రష్యా చమురును భారత్ ఎగుమతి చేసుకునేందుకు అమెరికా ఆంక్షలపై ఎత్తివేసిన తర్వాత రష్యా అతిపెద్ద ఇంధన సరఫరాదారుగా తిరిగి ఆవిర్భవించింది.
