ఐపీఎల్ 19లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచులో బ్యాటింగ్‌లో చెన్నై దుమ్మురేపింది. హోం గ్రౌండ్ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో సేఎస్కే యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే (73) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ (7) మరోసారి నిరాశపర్చగా కెప్టె్న్ రుతురాజ్ గైక్వాడ్ (28) పర్వాలేదనిపించాడు. చివర్లో సర్ఫరాజ్ ఖాన్ (32), శివమ్ దూబే (45) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు పడగొట్టగా.. బార్ట్లెట్, యాన్సెన్, చాహల్ తలో వికెట్ సాధించారు.
శాంసన్ ఫట్.. మాత్రే హిట్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సరైన శుభారంభం దక్కలేదు. పంజాబ్ బౌలర్ బార్ట్లెట్ రెండో ఓవర్లోనే సంజు శాంసన్ (7)ను ఔట్ చేసి చెన్నైకు షాకిచ్చాడు. దీంతో వరుసగా రెండో మ్యాచులో కూడా విఫలమైన శాంసన్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. శాంసన్ ఔటైన తర్వాత కెప్టెన్ గైక్వాడ్ (28)తో కలిసి యువ ఆటగాడు మాత్రే చెలరేగి ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఫోర్లు, సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఓవరాల్‌గా 43 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 73 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. హార్డ్ హిట్టర్‌గా పేరున్న యువ బ్యాటర్ కార్తీక్ శర్మ (3) ఈ మ్యాచులో కూడా నిరాశ పర్చాడు. ఈ దశలో జతకట్టిన సర్ఫరాజ్ ఖాన్ (32), శివమ్ దూబే (45) చివర్లో మెరుపులు మెరిపించి చెన్నైకు భారీ స్కోర్ అందించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు పడగొట్టగా.. బార్ట్లెట్, యాన్సెన్, చాహల్ తలో వికెట్ సాధించారు. అనంతరం పంజాబ్ 210 పరుగుల భారీ లక్ష్య ఛేధనకు దిగింది పంజాబ్.
