నిర్మల్ జిల్లా బాసరల్ ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన నేపథ్యంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఏప్రిల్ 6న బాసరలో సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుంది. ముఖ్యంగా రాబోయే పుష్కరాల కోసం చేపట్టాల్సిన పనులు ఆలయ ఆధునీకరణ మరియు మాస్టర్ ప్లాన్ అంశాలను మంత్రులు పరిశీలించారు.
బాసరలో మంత్రులకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బాసర టెంపుల్ మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారులకు కీలక సూచనలు చేసిన మంత్రులు.. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులకు కనీస సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దని పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
►ALSO READ | రాముడు బీజేపీ జాగీరా.. మీ పార్టీలో సభ్యత్వం ఉందా.?: మహేశ్ కుమార్ గౌడ్
