పంపకాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలె

పంపకాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలె

హైదరాబాద్: కోర్టుకు రావాలనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ.. కోర్టులకు వచ్చే ముందే తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారాలు చేసుకోవచ్చని సూచించారు. హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్ర సన్నాహక సదస్సులో ఎన్వీ రమణ పాల్గొన్నారు. దేశంలో పీవీ నర్సింహారావు ఎన్నో సంస్కరణలు తెచ్చారన్నారు.. సంస్కరణలకు అనుగుణంగా చట్టాలు మారినప్పుడే మార్పు వస్తుందన్నారు ఎన్వీ రమణ.. ఆస్తుల పంపకాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని అన్నారు.