రెస్టారెంట్ కూలిన ప్రమాదంలో ఏడుగురు జవాన్లు మృతి

రెస్టారెంట్ కూలిన ప్రమాదంలో ఏడుగురు జవాన్లు మృతి

హిమాచల్ ప్రదేశ్ సోలన్ లో బిల్డింగ్ కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఉదయం మరో మృతదేహాన్ని NDRF టీంలు గుర్తించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పదిమంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పౌరులు కాగా.. మిగతా ఏడుగురు ఆర్మీ జవాన్లున్నారు. మరో 17 మంది ఆర్మీ సిబ్బంది, 11 పౌరులను ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది రక్షించారు. మరో ఏడుగురు జవాన్లు శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారుడు చెబుతున్నారు. ఈ బిల్డింగ్ లో రెస్టారెంట్ రన్ చేస్తున్నారు. డ్యూటీలో భాగంగా.. ఉత్తరాఖండ్ వెళుతున్న జవాన్లు భోజనం కోసం రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగింది.

బిల్డింగ్ కూలిన ప్రాంతాన్ని సీఎం జైరాం థాకూర్ పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా నిర్మించలేదన్నారు సీఎం. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామన్నారు. అవసరమైన ఎక్విప్ మెంట్ తరలించేందుకు తన హెలికాప్టర్ పంపించానన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు.