అమ్మాయిని కాపాడబోయి బావిలో పడ్డ 40 మంది

అమ్మాయిని కాపాడబోయి బావిలో పడ్డ 40 మంది
  • అమ్మాయిని కాపాడబోయి 40 మంది బావిలో పడ్డరు
  • మధ్యప్రదేశ్​లోని విదిషా జిల్లాలో ఘటన
  • 11 డెడ్ బాడీల వెలికితీత
  • కొనసాగుతున్న రెస్క్యూ పనులు

విదిషా: బావిలో పడిన ఓ టీనేజ్ అమ్మాయిని కాపాడబోయి దాదాపు 40 మంది అందులోనే పడ్డారు. మధ్యప్రదేశ్​లోని విదిషా జిల్లాలోని  లాల్ పతార్ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇప్పటివరకు 11 డెడ్ బాడీలను వెలికితీసినట్లు సీఎంవో కార్యాలయం శుక్రవారం తెలిపింది. రాత్రి 9 గంటల సమయంలో ఆ అమ్మాయి బావిలో పడింది. ఇది తెలియగానే కాపాడేందుకు కొందరు గ్రామస్తులు అందులోకి దిగారు. మరికొందరు బావి పైకప్పు వద్ద నిలబడటంతో అది ఒక్కసారిగా కూలి వారు లోపల పడిపోయారు. ఇటు రాత్రి 11 గంటల సమయంలో  సహాయక చర్యల్లో పాల్గొన్న నలుగురు పోలీసులు కూడా అందులో పడ్డారని అక్కడి వారు చెప్పారు. 50 అడుగుల లోతున్న ఆ బావిలో 20 అడుగుల మేర నీళ్లున్నాయని అంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ఇప్పటివరకు19 మందిని కాపాడి ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ ఆఫీసర్ భరత్ భూషణ్ శర్మ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందన్నారు.

పరిస్థితిని సమీక్షిస్తున్న: సీఎం చౌహాన్
ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘అధికారులతో టచ్ లో ఉన్నాను. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇస్తాం. గాయపడిన వారికి రూ.50 వేలు, ఉచిత వైద్యచికిత్సను అందిస్తాం..’ అని ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు నా సంతాపం: మోడీ

విదిషా ఘటన పట్ల ప్రధాని మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన దేవుడిని ప్రార్థించారు. ‘మధ్యప్రదేశ్‌లోని విదిషాలో జరిగిన ఘటన పట్ల తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను.  చనిపోయిన వారి కుటుంబాలకు పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది’ అని మోడీ ట్వీట్ చేశారు.

https://twitter.com/PMOIndia/status/1416089024708579332