జైళ్లలో 80% మంది విచారణ ఖైదీలే

జైళ్లలో 80% మంది విచారణ ఖైదీలే

జైపూర్: దేశంలోని జైళ్లలో ఎక్కువ మంది అండర్ ట్రయల్ ఖైదీలే ఉన్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 6.10 లక్షల మంది జైళ్లలో ఉంటే, వాళ్లలో దాదాపు 80% మంది అండర్ ట్రయల్ ఖైదీలేనని చెప్పారు. వాళ్లంద రూ ఎలాంటి విచారణ లేకుండానే ఏండ్లకేండ్లుగా నిర్బంధంలో ఉన్నారని విచారం వ్యక్తంచేశారు. ఈ పద్ధతిపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో న్యాయ ప్రక్రియనే శిక్షగా మారింది. ఇష్టానుసా రంగా అరెస్టులు చేయడం, బెయిల్ పొందడంలో ఇబ్బందులు, ఏండ్లకేండ్లు గా నిర్బంధంలో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీలు, ఇందుకు దారితీస్తున్న పరిస్థి తులపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్​ను మరింత మెరుగు పరిచేందు కు యాక్షన్ ప్లాన్ అవసరమని చెప్పా రు. జైపూర్​లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న 18వ ఆలిండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ సదస్సు శనివారం ప్రారంభమైంది. నల్సా రూపొందించి న మొబైల్ యాప్, ఈ–ప్రిజన్స్ పోర్టల్​ను సీజేఐ ప్రారంభించి మాట్లాడారు.