
హీరో వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన మామ ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామ రెడ్డి తరపున ప్రచారం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని ఈ ఎన్నికల్లో రఘురామి రెడ్డిని గెలిపించాలని కోరారు. రాఘురామి రెడ్డి గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తారో చెప్పారు. ఐదేళ్లలో నామా నాగేశ్వర్ రావు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అశ్రిత ఎన్నికల ప్రచారం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఖమ్మంలో కాంగ్రెస్ నుంచి రఘురామరెడ్డి, బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీ చేస్తున్నారు.
వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత రఘురామిరెడ్డి కొడుకు వినాయక్ రెడ్డిని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్ కూడా రఘురామ రెడ్డి తరపున ఖమ్మంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది.