
ముంబైలోని గోరెగావ్ లో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో వీధి ఫుడ్ వ్యాపారి విఠల్ దళవి (48)పై దిండోషి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏప్రిల్ 24న ముంబైలోని గోరెగావ్ లోని ఓ హోటల్ లో చికెన్ షావర్మా తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది కడుపునొప్పి, వాంతులు విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. వారికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఫుడ్ పాయిజన్ అయ్యిందని నిర్ధారించారు. సంతో ష్ నగర్ లోని దళవి ఫుడ్ స్టాల్ లో కుళ్లిన చికెన్ షావర్మా తినడంతో ఫుడ్ పాయిజన్ అయిందని గుర్తించారు. దీనిపై ఏప్రిల్ 25న కేసు నమోదు చేశారు పోలీసులు
పోలీసుల వివరాల ప్రకారం.. గోరేగావ్ తూర్పులోని సంతోష్ నగర్‌లోని శాటిలైట్ భవనం ముందు దళవి గత ఆరు నుంచి ఏడు నెలలుగా షావర్మా స్టాల్‌ను నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్ 24న దళవి స్టాల్‌లో షావర్మా తిన్నాడు వెంటనే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతని తండ్రి పరాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం రెండు రోజుల వ్యవధిలోనే 12 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 273 (విషాదకరమైన ఆహారం లేదా పానీయాల అమ్మకం) కింద, ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (తయారీ, అమ్మకం, లేదా) సెక్షన్ 59 (2) కింద దలావిపై ఫిర్యాదు చేశారు. అతనికి సీఆర్పీసీ సెక్షన్ 155(2) కింద నోటీసు జారీ చేశామని పోలీసులు తెలిపారు. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని దీనిపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ , ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కి తెలియజేశామని తెలిపారు.