చెయ్యని తప్పుకు 19 ఏళ్ల జైలు : 33 కోట్ల పరిహారం డిమాండ్

చెయ్యని తప్పుకు 19 ఏళ్ల జైలు : 33 కోట్ల పరిహారం డిమాండ్

చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించిన ఎకనమిస్ట్‌‌‌‌
పరిహారం ఇవ్వాలని ఆస్ట్రేలియా సర్కారుకు కోర్టు ఆదేశం

ఆస్ట్రేలియాలోని ఓ ఆర్థికవేత్త. చెయ్యని నేరానికి 19 ఏళ్లు శిక్ష అనుభవించాడు. తన తప్పేమీ లేదని గుర్తించిన కోర్టు 2004లో శిక్ష రద్దు చేసింది. బయటకొచ్చిన ఆయన కోర్టులో కేసేశాడు. 19 ఏళ్ల తన జీవితాన్ని నాశనం చేసినందుకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశాడు. కేసు వాదనలు విన్న కోర్టు.. ఆయనకు రూ. 33 కోట్ల పరిహారం ఇవ్వాలని సోమవారం సర్కారును ఆదేశించింది. 1989లో సబర్బన్‌‌‌‌ కాన్‌‌‌‌బెర్రాలో ఆస్ట్రేలియన్‌‌‌‌ ఫెడరల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ కొలిన్‌‌‌‌ వించెస్టర్‌‌‌‌   కారు దిగుతుండగా కాల్చి చంపారు. హత్య చేసింది మాజీ పబ్లిక్‌‌‌‌ సర్వెంట్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌మన్‌‌‌‌ (ఆర్థికవేత్త) అని 1995లో తేల్చిన అక్కడి కోర్టు జీవితఖైదు విధించింది. అయితే తన హత్యలో తన ప్రమేయం లేదని 2014లో గుర్తించిన అక్కడి సుప్రీంకోర్టు శిక్షను రద్దు చేసింది. కానీ పరిహారం కోసం డేవిడ్‌‌‌‌  దావా వేశాడు.

రూ.86 కోట్ల కావాలని డిమండ్‌‌‌‌ చేశాడు. శిక్ష వల్ల ఫ్యామిలీ లేకుండా పోయిందని, లైఫే నాశనమైందని కోర్టుకు విన్నవించాడు. జైల్లో ఉన్నప్పుడే తన తల్లి, సోదరి చనిపోయారని ఏడ్చాడు. 2006లో తోటి ఖైదీ దాడి చేయడంతో ఓ కన్నుకు గాయమై ఇప్పటికీ చూడలేకపోతున్నానని తెలిపారు. వాదనలు విన్న కోర్టు డేవిడ్‌‌‌‌కు రూ.33 కోట్లు కట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. డేవిడ్‌‌‌‌ తరఫున లాయర్‌‌‌‌ సామ్‌‌‌‌ టియర్నీ మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు తీర్పుతో తన క్లైంట్‌‌‌‌ హ్యాప్పీగా ఉన్నారని చెప్పారు. మరి ఆ నిర్ణయంపై ప్రభుత్వం అప్పీల్‌‌‌‌కు వెళ్తుందా లేదా మాత్రం ఇంకా  తెలియదు. ఆ కేసు కోసం ఇప్పటికే రూ. 144 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని అక్కడి మీడియా వెల్లడించింది.