బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్

బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్

బెంగళూరులో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు పక్కా సమాచారం రావడంతో రైడ్ చేశారు. ఈ రైడ్ లో భారీగా  డ్రగ్స్‌, కోకైన్‌ ను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. రేవ్ పార్టీపై పోలీసులకు పక్కా సమాచారం రావడంతో రైడ్ చేశారు.

ఈ రైడ్ లో పోలీసులకు డ్రగ్స్‌, కోకైన్‌ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు.  జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది.

రేవ్‌ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారు సైతం లభ్యమయ్యింది. ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.