కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

హైదరాబాద్ లో  అక్రమ నిర్మాణాలపై  జీహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టారు. కూకట్ పల్లి జేఎన్టీయూ రైతుబజార్,  కూకట్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఫుట్ పాత్ అక్రమణలను జీహెచ్ఎంసీ  అధికారులు కూల్చివేశారు. జేసీబీతో షాపుల ముందు, మురికి కాలువలపై నిర్మించిన కట్టడాలను,పర్మిషన్ లేకుండా నిర్మించిన నిర్మాణాలను  ఎక్కడిక్కడే కూల్చివేశారు. 

మరో వైపు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పసుమములలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు  అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ అధికారులు.  పసుమాముల గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 422 ప్రభుత్వ భూమిలో 20 గుంటల భూమి కబ్జా చేసి షెడ్డు వేశారు కొందరు . ఇవాళ  తెల్లవారు జామున అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు  రెవెన్యూ అధికారులు.