
దారిన పోయే దానయ్యలు ఎంతో మంది ఎన్నో అంటారు.. నువ్వెందుకు పట్టించుకున్నావు తల్లీ.. పనీ పాటా లేని సోంబేరిగాళ్లు ఏదేదో రాస్తుంటారు వాటిని ఎందుకు సీరియస్ గా తీసుకున్నావు తల్లీ.. ఏది మంచో ఏది చెడో కూడా తెలియని లఫూట్స్ ఎన్నోన్నో కామెంట్స్ చేస్తుంటారు.. నువ్వెందుకు ఫీలవ్వాలి తల్లీ.. ఏది నిజం.. ఏది అబద్దమో తెలియకుండా ఎవడు పడితే వాడు.. ఏది పడితే అది వాగుతుంటాడు.. నువ్వెందుకు దానికి బలి కావాలి తల్లీ.. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. బాధిత కుటుంబం.. ఆత్మహత్య చేసుకున్న ఓ తల్లి కుటుంబం.. సోషల్ మీడియా వల్ల ఓ తల్లి తనకు తాను ఆత్మహత్య చేసుకున్నది.. చెన్నైలో జరిగిన ఈ ఘటనకు చలించిన జనం.. సోషల్ మీడియాను దుమ్మెత్తిపోస్తున్నారు.. ఈ పూర్తి వివరాల్లోకి వెళితే...
తమిళనాడు రాజధాని చెన్నైలో (Chennai అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఏడు నెలల చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు జారింది. అదృష్టవశాత్తూ మరో అంతస్తు అంచున పడి ఆగింది. దీంతో చిన్నారిని రక్షించేందుకు హౌసింగ్ సొసైటీలోని పలువురు ముందుకొచ్చారు. బెడ్ షీట్లు (Bed Sheets) పట్టుకుని కొంతమంది కింద నిల్చున్నారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు పైకెక్కి చిన్నారిని రక్షించారు. పాపను రక్షించిన వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ విషయంలో సోషల్ మీడియా ప్రముఖులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారి చిన్నారి తల్లిని అవహేళనగా.. ఫెయిల్యూర్ మదర్ అంటూ ట్రోల్స్ చేస్తూ ఆడుకున్నారు. ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందిరా అని జాలిపడాల్సిన సమయంలో ఆమె ఏదో చేయరాని తప్పు చేసిన విధంగా సోషల్ మీడియాలో కొంతమంది చేసిన అత్యుత్సాహానికి.... సోషల్ మీడియా ట్రోలింగ్స్ కు భరించలేక ఆ చిన్నారి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఆపదలో ఉన్న చిన్నారిని ఇరుగు పొరుగు వారు కాపాడగా... సోషల్మీడియా ఆథర్లు మాత్రం ఆ చిన్నారికి తల్లి లేకుండా చేశారు.
గత కొద్ది రోజుల క్రితం ఏడు నెలల చిన్నారి అపార్ట్మెంట్ పై నుండి కింద పడిపోతుండగా స్థానికులు అంత కలిసి కాపాడారు.ఐతే ఈ విషయం పై పలువురు ఆ చిన్నారి తల్లి రమ్యని సోషల్ మీడియా వేదికలో నిందించారు. ఇక మీడియా కూడా ఫెయిల్యూర్ మదర్ అంటూ కథనాలు ప్రసారం చేసాయి. చివరికి ఈ ట్రోలింగ్ తట్టుకోలేక రమ్య ఆత్మ హత్య చేసుకుంది.
చేతిలో స్మార్ట్ ఫోన్.. ల్యాప్టాప్.. కంప్యూటర్ ఉంది కదా అని .. సోషల్ మీడియాలో అక్కర్లేనివి.. జనాలకు ఉపయోగం లేకుండా ఉండేవి .. వేరే వారిని కించపరుస్తూ ఉండే వాటిని పోస్ట్ చేస్తే సెన్సిటివ్ మనస్థత్వం గల వారు ఇలాగే ఆత్మహత్య చేసుకుంటారని గుర్తించాలి. ఇకనైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారు వెనుకా .. ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. . .