భారతీయ ఆవిష్కరణలకు ప్రపంచ దేశాలు ఫిదా:ప్రధాని మోదీ

భారతీయ ఆవిష్కరణలకు ప్రపంచ దేశాలు ఫిదా:ప్రధాని మోదీ

ఢిల్లీ: భారతదేశం సాంకేతిక రంగంలో ప్రపంచానికే దిక్సూచిగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్ లో ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 దేశాభివృద్ధికి టర్నింగ్ పాయింట్ అని అన్నారు. భారతీయ ఆవిష్క రణలకు ప్రపంచ దేశాలు ఫిదా అయ్యాయని అన్నారు. ఏఐ కేపలం సాఫ్ట్ వేర్ రంగాలకే పరిమితం కాకుండా జంతువులు, పాడి పరిశ్రమ, వైద్య రంగంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకోస్తుందని ఆకాంక్షించారు. పాడి రైతులు తమ పశువుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ఏఐ అసి స్టెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అవయవ దానం గురించి ప్రజ ల్లో అవగాహన పెరగాలన్నారు. మరో వైపు డిజిటల్ భద్రతపై ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. ఆవిష్కరణలు, వ్యవస్థాపన లు ద్వారా ప్రపంచ ధ్రుష్టిని ఆకర్షించే గుణం భారతీయ యువతకు ఉందన్నారు.

హైస్పీడ్ టైన్లో మోదీ జర్నీ

నమో భారత్ కేవలం ఒక రైలు కాదని అభివృద్ధికి నిదర్శనం అని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ ఢిల్లీ, మీరట్ మధ్య 82 కిలో మీటర్లు ఆర్ఆర్ టీఎస్ రైలు కారిడార్ ను ప్రధాని ప్రారంభించారు. దీంలో భాగంగా మీరట్ మెట్రో రైలు సేవలను సైతం ప్రజావినియోగంలో తీసుకొచ్చారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఈ కారిడార్ ద్వారా ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతం ఆర్థికాభివృద్ధి చెందిని అన్నారు. ప్రయాణికులకు రవాణా మరింత సులభతరం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం వికసిత్ భారత్ దిశగా వేసిన ఒక బలమైన అడుగు అని ప్రధాని పేర్కొన్నారు.