తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెళ్లిల సీజన్ కానప్పటికీ బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. తులం గోల్డ్ కు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు రూ.500 లు పెరిగింది. ఆంధ్రప్రధేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ధరలు సమానంగా ఉన్నాయి. దీంతో పసిడి ప్రియుల బంగారం కొందామంటేనే జంకుతున్నారు.

సోమవారం హైదరాబాద్‌లో ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.6890లు గా ఉంది. అదే.. 10 గ్రాములకు (తులం) రూ.68,900 రేటు పలుకుతుంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటి కంటే రూ.500 పెరిగింది.
ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే గ్రాము ధర రూ.7,516గా ఉంది. 10 గ్రాము(తులం)లకు రూ.75వేల 160 ధర ఉంది. ఇది నిన్నటితో  పోల్చుకుంటే రూ.540లు పెరిగింది. వెండి ధర మాత్రం నిన్నటి కంటే ఒక్క రూపాయి తగ్గింది. వెండి ఒక గ్రాము రూ.96 రేటు గా ఉంది.10గ్రాముల వెండి రేటు ఈరోజు రూ.964 ఉంది.