తిరుపతి లడ్డూలో కెమికల్స్ తో చేసిన నెయ్యి వాడారు..పవన్ కీలక వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూలో కెమికల్స్ తో చేసిన నెయ్యి వాడారు..పవన్ కీలక వ్యాఖ్యలు

వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.   కల్తీ నెయ్యి వ్యవహారంపై  ఏపీ అసెంబ్లీలో ఇవాళ(ఫిబ్రవరి 24) చర్చ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ..నెయ్యి లేకుండానే నెయ్యి తయారీ జరిగినట్టు రిపోర్టులు ఉన్నాయన్నారు. గత పాలకులు కెమికల్స్ నుంచి నెయ్యి తయారు చేయవచ్చని నిరూపించారని ఆరోపించారు. తిరుమలలో తప్పు జరిగిందనే పశ్చాత్తాపంతో తాను దీక్ష చేశానని చెప్పారు. గత ప్రభుత్వ అధినేత తప్పు చేశాడని తాను ఎక్కడా చెప్పలేదన్నారు పవన్.  నాటి టీటీడీ పాలక మండలి బాధ్యత నిర్వహణలో విఫలమైందని...టీటీడీ బోర్దుదే తప్పని తాను చెప్పాననన్నారు పవన్.

గతంలో లడ్డూల్లో నాణ్యత లేదనే ఆరోపణలొచ్చాయన్నారు. వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు పవన్.  కల్తీ నెయ్యి కేసులో 36 మందిని సిట్ నిందితులుగా తేల్చిందన్నారు. నచ్చిన సంస్థలకు నెయ్యి సరఫరా టెండర్లు కట్టబెట్టారని చెప్పారు. రూల్స్ పక్కన పెట్టి అడ్డగోలుగా వ్యవహరించారని  సిట్ చెప్పిందన్నారు. నెయ్యి సరఫరా చేసే  సంస్థకు కనీస అర్హతలు లేవని సిట్ వెల్లడించిందన్నారు. 

తిరుమల కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఈ కమిటీ 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.  కల్తీ నెయ్యి టెండర్ ప్రక్రియ, జరిగిన లోటు పాట్లకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.

కలియుగ దైవం తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఇటీవల ఫైనల్ చార్జిషీట్ సమర్పించింది సీబీఐ సిట్. దీంతో ఈ అంశంపై మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తిరుమల లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యిలో జంతు కొవ్వు లేదంటూ సిట్ చార్జిషీట్ లో తేలిందని వైసీపీ అంటుంటే.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు చార్జిషీట్లో తేలిందని కూటమి నేతలు అంటున్నారు.