కల్తీ లడ్డూ పాపం వైసీపీదే: ఏపీ సీఎం చంద్రబాబు

కల్తీ లడ్డూ పాపం వైసీపీదే: ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీలో అసెంబ్లీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై వాడీ వేడీగా చర్చ సాగింది.  తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ పాపం వైసీపీ పాలకులదేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.  బ్రిటీష్ పాలకులు కూడా శ్రీవారి జోలికి వెళ్లలేదు.. దీనికి వెనక పెద్ద కుట్ర కోణం ఉంది.. కేవలం లడ్డూ విషయంలోనే కాదని, అనేక విషయాల్లో గత వైసీపీ పాలకులు తప్పులు చేశారన్నారు సీఎం చంద్రబాబు. కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దాదాపు 59.71లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందన్నారు. ల్యాబ్ కళ్లు గప్పి టెండర్లు దక్కించుకున్నారు చంద్రబాబు ఆరోపించారు. 

ఏపీ అసెంబ్లీలో తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం చంద్రబాబాబు మాట్లాడుతూ కల్తీ నెయ్యి వ్యవహారంలో దాదాపు రూ. 234 నిధులు అక్రమాలు జరిగాయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు.