
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మే 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటి జరుగుతోంది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ చర్చించే అవకాశం ఉంది.
కేబినెట్ భేటీకి కొన్ని షరతులతో కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4 లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే కేబినెట్ లో చర్చించాలని కండీషన్ పెట్టింది. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులెవరూ సమావేశానికి వెళ్లవద్దని ఆదేశించింది ఈసీ. రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని తెలిపింది.