న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌కి వానర మూవీ రిలీజ్

న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌కి వానర మూవీ రిలీజ్


అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా  ‘వానర’.  సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌‌‌‌గా నటించగా,  నందు విలన్‌‌‌‌గా  కనిపించనున్నాడు.  శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై అవినాశ్  బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న  విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

 ఇప్పటికే  విడుదల చేసిన   ఫస్ట్ లుక్,  మంచు మనోజ్  రిలీజ్ చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌కు  మంచి రెస్పాన్స్ వస్తోంది.  మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన ఈ మూవీ  ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇవ్వబోతోందని,  సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్,  వివేక్ సాగర్ మ్యూజిక్  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ చెప్పారు.  పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి ఇతర పాత్రలు పోషించారు.