ఉపాధి పేరు మార్చడం దుర్మార్గం : డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్

ఉపాధి పేరు మార్చడం దుర్మార్గం : డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్

వికారాబాద్, వెలుగు: దేశంలోని పేదలకు ఉపాధి కల్పించేందుకు గత యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఉపాధి హామీ పథకం పేరును ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మార్చడం దుర్మార్గమని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి నివాళి అర్పించి, వినతి పత్రం అందజేశారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అంటే గాంధీజీ ఆశయాలను అవమానించడమేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, నాయకులు వి.సత్యనారాయణ, ఎన్.కిషన్​ నాయక్, సంతోష్, రమేశ్, మహిపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సతీశ్​రెడ్డి, సంతోష్​గౌడ్, వెంకటయ్య తదితరులున్నారు.