ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిత్రాలను విడుదల చేసిన బన్నీ వాస్, వంశీ నందిపాటి ఇప్పుడు ‘ఈషా’ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్‌లో శ్రీనివాస్ మన్నె తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు.
ఈనెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న బన్నీ వాస్, వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘హారర్ థ్రిల్లర్స్‌లో ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. మొదటి పది నిమిషాల్లోనే మేము ఈ సినిమా ఎందుకు తీసుకున్నామో అందరికీ అర్థమవుతుంది. ఈ సిని మా విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాం.
తప్పకుండా ఈ సినిమా మా నమ్మకాన్ని నిలబెడుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ స్టన్నింగ్‌గా ఉంటాయి. చివరి 20 నిమిషాలు హారర్ సినిమాలా అనిపించదు. ఓ మంచి విషయాన్ని చెప్పారని ఫీల్ అవుతారు. మన లైఫ్‌లో కూడా ఇలా జరిగిందా అనే ఫీల్ కలుగుతుంది. ఈ సినిమా ఎవరినీ డిజప్పాయింట్ చేయదు. ఇప్పుడు మేము వెళుతున్న జర్నీ చాలా బాగుంది. ఫస్ట్‌కాపీ చూసిన తరువాత మా జడ్జిమెంట్ బాగుంటుంది. మాదొక కొత్త ట్రెండ్. ఫిల్మ్‌ను ఓ స్ట్రాటజీ ప్రకారం విడుదల చేస్తున్నాం’ అని అన్నారు.
