లారెన్స్ ట్రస్టులో 20 మంది పిల్లలకు వైరస్

లారెన్స్ ట్రస్టులో 20 మంది పిల్లలకు వైరస్

చెన్నై: ప్రముఖ యాక్టర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నడుపుతున్న చారిటబుల్ ట్రస్టులో 20 మందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. చెన్నైలోని అశోక్ నగర్‌ లో ఉన్న లారెన్స్ ట్రస్టులో 25 మంది దివ్యాంగులు, అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. అందులో నలుగురికి జ్వరం రావడంతో శనివారం శాంపిల్స్ టెస్టు చేయగా కరోనా కన్ఫామ్ అయింది. దీంతో మిగతావారందరి నుంచి నమూనాలు సేకరించి టెస్టులు చేయగా 20 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ట్రస్ట్ సెంటర్​ను మూసివేసిన అధికారులు.. ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్​గా ప్రకటించారు. వైరస్ బారిన పడిన పిల్లలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో పనిచేస్తున్న వంటమనిషి నుంచి పిల్లలకు వైరస్ సోకిందని అధికారులు నిర్ధారించారు.