వీధి కుక్కల దాడి.. ఆరేళ్ల చిన్నారి మృతి

వీధి కుక్కల దాడి.. ఆరేళ్ల చిన్నారి మృతి

బోడుప్పల్ లో ఘటన
హైదరాబాద్: వీధి కుక్కలు దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందిన ఘటన బోడుప్పల్ లో జరిగింది. సదరు బాలిక కుటుంబీకులు చెంగిచెర్ల గార్బేజ్ సెగ్రిగేషన్ ఏరియాలో ఉంటున్నారు. ఆ బాలిక బోడుప్పల్ లో ఉదయం ఆడుకుంటూ ఉండగా నాలుగు వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. గాయపడిన బాలికను ఆదిత్య ఆస్పత్రికి తీసుకెళ్లగా.. రెండు గంటల తర్వాత ఆస్పత్రి యాజమాన్యం బాలికను వేరే అంకుర హాస్పిటల్ కు తీసుకెళ్లాలని చిన్నారి ఫ్యామిలీకి సూచించింది. అంకుర ఆస్పత్రిలో మూడు గంటల ట్రీట్ మెంట్ తర్వాత చిన్నారిని యశోద హాస్పిటల్ కు రిఫర్ చేయగా.. అడ్మిట్ చేయడానికి ఆ ఆస్పత్రి మేనేజ్ మెంట్ తిరస్కరించింది. దీంతో బాలికను ఫీవర్ హాస్పిటల్ కు.. అక్కడి నుంచి నీలోఫర్ కు షిఫ్ట్ చేశారు. చివరకు నిలోఫర్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతూ సాయంత్రం చిన్నారి చనిపోయింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్ అచ్యుతా రావు డిమాండ్ చేశారు. చిన్నారి అంత్యక్రియలకు కార్పొరేషన్ ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ శంకర్.. బాలిక కుటుంబానికి నష్ట పరిహారం అందిస్తామని చెప్పారు.