
"సురేశ్యందేయుం సుమలతాయుడెయుం హృదయహరియాయ ప్రణయకథ"..ఇదేంటీ..ఇన్ని సినిమాలు..ఇంత మంది హీరోలు అనుకుంటున్నారా! లేకపోతే ఏదైనా శ్లోకం చదివిన ఫీలింగ్ వస్తుందా..? అయితే, ఇదేమి కాదండీ..ఇదొక లేటెస్ట్ మలయాళ సినిమా పేరు.
రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ దర్శకత్వం వహించిన మలయాళ రొమాంటిక్ చిత్రం ఇది. రాజేష్ మాధవన్ మరియు చిత్రా నాయర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ టైటిల్‌తోనే ఆల్మోస్ట్ ఆడియెన్స్‌ను ఫిదా చేసేసింది. అంతేకాదు..మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద టైటిల్‌తో వచ్చిన మూవీగా నిలిచింది.
ఏ సినిమాకి ఐనా టైటిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఒక టైటిల్ వెనుక సినిమా కథే దాగుంటుంది. అందుకే..డైరెక్టర్..హీరో ఎంతపెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్న టైటిల్ ఏంటనే అడుగుతారు. ఇక ఒక్కసారిగా టైటిల్ అనౌన్స్ చేసాక..బాగుంటే ఆడిక్ట్ అవుతారు. లేదంటే ఆ సినిమాపై పెదవివిరుస్తారు. టైటిల్ ఎంత క్యాచీగా ఉంటే ఆ మూవీ అంత ఈజీగా ఆడియెన్స్‌కు రీచ్ అవుతుంది. అందుకే ఒక సినిమాకు టైటిల్స్ ఫిక్స్ చేసే విషయంలో దర్శకనిర్మాతలు ఎన్నో తర్జనభర్జనలు పడుతుంటారు. ఒక్కోసారి కథ బాగున్నా సరైన టైటిల్స్ లేక ఫెయిలైన సినిమాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.అంత ఇంపాక్ట్ ఉంటుంది ఒక సినిమాకి పెట్టె టైటిల్కు.
అలాగే కొన్ని సినిమాల టైటిళ్లు చాలా ఈజీగా కెనెక్ట అవ్వడానికి ఒకటి, రెండు పదాలతో పెడుతుంటారు. మరికొన్ని సినిమాలకి అర్ధం కాకుండా చాలా క్లిష్టమైన పదంతో సెలెక్ట్ చేస్తుంటారు. ఇలా చాలా టిపికల్ టైటిల్ తో లేటెస్ట్గా (మే 16న) మలయాళ థియేటర్లో రిలీజైన మూవీ సురేశ్యందేయుం సుమలతాయుడెయుం హృదయహరియాయ ప్రణయకథ. ఇలా పలకడానికి కూడా కష్టంగా ఉండటంతో..టైటిల్‌ను కుదించి సు..సు అంటూ పిలుస్తున్నారు ఆడియన్స్.
బెస్ట్ డైరెక్టర్‌గా రెండుసార్లు కేరళ రాష్ట్ర అవార్డులను అందుకున్న రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ తెరకెక్కించిన సినిమా కావడంతో పాటు టైటిల్ చూసి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి టైటిల్ వెనుక ఉన్న కథేంటీ? విభిన్నంగా అలోచించి పెట్టిన టైటిల్ లానే సినిమా కూడా ఉందా ? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే!