60 ఏళ్ల బామ్మ.. ఇడ్లీ చాంపియన్

60 ఏళ్ల బామ్మ.. ఇడ్లీ చాంపియన్
  • మైసూరులో దసరా సంబురాల్లో ఇడ్లీ ఈటింగ్ పోటీ
  • 60 సెకన్లలో 6 ఇడ్లీలు.. 60 ఏళ్ల బామ్మ విన్నర్

మైసూరు దసరా సంబురాల్లో ఓ 60 ఏళ్ల బామ్మ చాంపియన్ గా నిలిచింది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోటీలో కుర్రోళ్లతో పోటీపడి వృద్ధురాలు విజయం సాధించింది. తన స్పీడ్ తో యువతుల్ని కూడా బీట్ చేసి.. నంబర్ వన్ పొజిషన్ లో నిలిచింది. ఇంతకీ ఆ పోటీ ఏంటనేనా..? అది తిండి పోటీ.

మైసూరు దసరా వేడుకల్లో భాగంగా మహిళలకు ప్రత్యేకంగా ఇడ్లీ ఈటింగ్ కాంపిటీషన్ పెట్టారు. మంగళవారం జరిగిన ఈ పోటీలో చిన్న పిల్లలు, యువతులు మొదలు వృద్ధులు వరకూ అందరూ పాల్గొన్నారు. 60 సెకన్లలో ఎవరు ఎక్కువ ఇడ్లీలు తింటే వారే విజేత అని ఆర్గనైజర్స్ ప్రకటించారు.

అందరికీ ఇడ్లీ.. సాంబార్ రెడీగా పెట్టారు. వన్, టూ, త్రీ.. రెడీ గో.. అనగానే అందరూ తినడం స్టార్ట్ చేశారు. ఈవెంట్ మొత్తాన్ని వీడియో తీశారు. ఓ వరుసలో కూర్చుని ఉన్న 60 ఏళ్ల బామ్మ సరోజమ్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పోటీని నిర్వహిస్తున్న వారు ఆమె స్పీడ్ చూసి ఆశ్చర్యపోయారు. చివరికి ఆమే అందరికన్నా ఎక్కువగా 60 సెకన్లలో 6 ఇడ్లీలు తిని విజేతగా నిలిచింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.