Jabardasth Pavitra: జబర్దస్త్ కమెడియన్కు కారు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ నటి పవిత్ర

Jabardasth Pavitra: జబర్దస్త్ కమెడియన్కు కారు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ నటి పవిత్ర

జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర(Jabardasth Pavitra)కు కారు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కానీ, అదృష్టవశాస్తూ ఎవరికీ ఏమీ కాలేదు. చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఎన్నికల వేల ఓటు వేసేందుకు తన పిన్ని, వల్ల పిల్లలతో కలిసి సొంతూరు వెళ్లారు పవిత్ర. నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు దగ్గర ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన పవిత్ర కారు గోతిలో పడింది. దాంతో.. కారు ముందు భాగం మొత్తం దెబ్బతింది. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే పవిత్రకు ఈ కారు ప్రమాదం వారం రోజుల క్రితం జరిగిందట. ఇదే విషయాన్ని స్వయంగా పవిత్ర తన సోషల్ మీడియా వైదికగా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. మా పిన్ని, వల్ల పిల్లలిద్దరూ ఫస్ట్ టైమ్ నా కారు ఎక్కారు. మరో 10 నిమిషాల్లో ఇల్లు చేరుతాం అనుకునేలోపు ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనం డ్రైవర్ కన్ఫ్యూజ్ చేయడంతోనే మా కారు రోడ్డు పైనుండి గుంతలోకి వెళ్ళింది. అదృష్టవశాస్తూ ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. సీటు బెల్ట్ ధరించడం వల్లే భారీ ప్రమాదం నుండి తప్పించుకున్నాం.. అంటూ ఎమోషనల్ అయ్యారు పవిత్ర.