ఆసరా పెన్షన్ల కోసం ఏటా రూ.9,402.48 కోట్లు: ఎర్రబెల్లి

ఆసరా పెన్షన్ల కోసం ఏటా రూ.9,402.48 కోట్లు: ఎర్రబెల్లి

ఆసరా పెన్షన్ల పథకం కింద 39,41,976 మంది లబ్ధి పొందారని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆసరా పెన్షన్ల పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు దయాకర్‌ రావు సమాధానం ఇచ్చారు. ఆసరా పెన్షన్ల లబ్దిదారుల వయసును 57 సంవత్సరాల వయసుకు కుదించామన్నారు. వారికి కూడా ఆసరా పెన్షన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ వివరాలను కలెక్టర్ల ద్వారా సేకరిస్తున్నామన్నారు. ఇబ్బందులు ఎక్కడ కూడా లేవని… పొరపాట్లుంటే సవరిస్తునట్లు చెప్పారు. దేశంలో ఇలాంటి పథకం లేదని.. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు ఎర్రబెల్లి. ఆసరా పెన్షన్ల కోసం ఏటా రూ.9,402.48 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.9,192.88 కోట్లు ఇస్తోందని…ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 209.60 కోట్లు మాత్రమేనని చెప్పారు. రాజస్థాన్‌లో రూ.750, మహారాష్ట్రలో రూ.600, గుజరాత్‌లో రూ.500, ఉత్తర ప్రదేశ్‌లో రూ.500, పంజాబ్‌లో రూ.500 చొప్పున పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి.