
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిన ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కు సలార్ మూవీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇక ఓటీటీలో కూడా భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంది సలార్.
ఇదిలా ఉంటే.. ఇటీవల సలార్ మూవీ టీవీలో కూడా ప్రసారమయ్యింది. అక్కడ కూడా అద్భుతమైన టీఆర్ఫీని సాధించింది సలార్. అయితే.. సలార్ మూవీ టెలివిజన్ ప్రీమియర్ సమయంలో ఒక కాంటెస్ట్ రన్ చేసింది ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా. ఆ కాంటెస్ట్ విన్నర్ కి సలార్ సినిమాలో ప్రభాస్ వాడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి బైక్ ను గిఫ్ట్ గా ప్రకటించింది. ఆ కాంటెస్ట్ లో రెండు రాష్ట్రాల నుండి లక్షల మంది పాల్గొనగా.. వారిలో విజయవాడకు చెందిన ప్రభాస్ అభిమాని వరప్రసాద్ ఈ కాంటెస్ట్ లో విరాజయం సాధించి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ను గెలుచుకున్నాడు.
? Congratulations to Varaprasad for participating and winning a bike in the Salaar Bike SMS Contest! ?️? We are thrilled to celebrate your victory and hope you enjoy your new ride! Keep shining and winning with Star Maa! ? #Salaar #BikeContestWinner #StarMaa pic.twitter.com/Q0HRUb3D2M
— Starmaa (@StarMaa) May 2, 2024
ఈ విషయాన్ని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. వరప్రసాద్ కు బైక్ ను అందజేసిన వీడియోను స్టార్ మా అఫీషియల్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇది చూసిన నెటిజన్స్ వరప్రసాద్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లక్కీ ఫ్యాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు నాగ్ అశ్విన్ తో కల్కి సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.