పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు.. కేసు పెట్టిన మహిళ

పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై  లైంగిక ఆరోపణలు.. కేసు పెట్టిన మహిళ

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనను లైంగికంగా వేధించారని కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లోని ఓ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది.  కోల్‌కతాలోని హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో కూడా మహిళ ఫిర్యాదు కూడా చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద బోస్ తనను   లైంగికంగా వేధించారంటూ ఫిర్యాదులో తెలిపింది.  

అయితే ఈ ఆరోపణలపై  గవర్నర్ సీవీ ఆనంద బోస్ స్పందించారు.  లైంగిక వేధింపుల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.  కల్పిత కథనాల్ని చూసి తాను భయపడనన్నారు.  చివరికి సత్యమే గెలుస్తుందని తెలిపారు.  ఈ  ప్రయత్నం ద్వారా ఎవరైనా రాజకీయంగా ప్రయత్నం పొందాలనుకుంటే వారిష్టమన్నారు.  రాష్ట్రంలో అవినీతి,  హింసపై తన పోరాటాన్ని ఎవనరూ ఆపలేరని చెప్పారు.  

మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ ఈ విషయంపై సోషల్ మీడియాలో తన ఆందోళనలను వ్యక్తం చేసింది, ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరింది.  గవర్నర్‌పై వేధింపుల ఫిర్యాదు అందిందని కోల్‌కతా పోలీస్ డిసి (సెంట్రల్) ఇందిరా ముఖర్జీ తెలిపారు.