పదవుల్లో అగ్రవర్ణాలదే ఆధిపత్యం..మొల్ల రామాయణం..గొప్ప కావ్యం

పదవుల్లో అగ్రవర్ణాలదే ఆధిపత్యం..మొల్ల రామాయణం..గొప్ప కావ్యం
  •     మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు  

బషీర్​బాగ్, వెలుగు : రిజర్వేషన్లు ఉన్నందునే మెరిట్ తగ్గి దేశం వెనుకబడిందని కొందరు చేస్తున్న ప్రచారం తప్పని రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డా. జె. పూర్ణచంద్రరావు అన్నారు. శుక్రవారం మొల్లమాంబ జయంతి సందర్భంగా సైఫాబాద్ ఏఐబీఎస్పీ ప్రధాన ఆఫీసు అయిన మీడియా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె ఫొటోకు నివాళులర్పించారు. 

ఆయన మాట్లాడుతూ, ఐదు వందల ఏళ్ల క్రితం మొల్ల రచించిన రామాయణం వంటి గొప్ప కావ్యాన్ని గుర్తించి గత ప్రభుత్వాలు ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేశాయన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, న్యాయమూర్తులు, కాంట్రాక్టర్లు వంటి పదవుల్లో అగ్రవర్ణాలే ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు. 

మరుగున పడేసిన బహుజన మహనీయుల గురించి మనమే చెప్పుకోవాలని, లేదంటే తప్పుడు ప్రచారాలు ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీసీ సమాజ్ అధ్యక్షులు సంగెం సూర్యారావు , విజయ కుమార్ , వెంకటయ్య, డా. వెంకటేశ్వర్లు, ధరణికోట లక్ష్మీనారాయణ హాజరయ్యారు