సీబీఎస్‌ఈ కొత్త రూల్: భగ్గుమంటున్న ప్రైవేట్ స్కూళ్లు.. 2 వారాల్లో క్లారిటీ ఇవ్వకపోతే కోర్టుకే!

సీబీఎస్‌ఈ కొత్త రూల్: భగ్గుమంటున్న ప్రైవేట్ స్కూళ్లు..  2 వారాల్లో క్లారిటీ ఇవ్వకపోతే కోర్టుకే!

బెంగళూరు: రాష్ట్రంలోని స్కూళ్లలో కన్నడను తప్పనిసరిగా మూడో భాషగా (Third Language) నేర్పించాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రైవేట్ స్కూళ్ల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (KAMS) తప్పుబట్టింది.

ఈ కొత్త నిబంధనను ప్రస్తుతానికి నిలిపివేయాలని కోరుతూ 'కామ్స్' (KAMS) అసోసియేషన్ CBSEకి ఒక లెటర్ రాసింది. కర్ణాటకలో 2015లో వచ్చిన భాషా చట్టం ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని CBSE, ICSE, స్టేట్ బోర్డ్ స్కూళ్లలో ఇప్పటికే కన్నడను మొదటి లేదా రెండో భాషగా తప్పనిసరిగా నేర్పిస్తున్నారని గుర్తుచేసింది.

ఇప్పుడు మళ్లీ కన్నడను మూడో భాషగా తప్పనిసరి చేయడం వల్ల పాత చట్టానికి, కొత్త రూల్‌కి మధ్య కన్ఫ్యూజన్ వస్తుందని అసోసియేషన్ అంటోంది. ఇప్పటికే కన్నడను మెయిన్ సబ్జెక్ట్‌గా బోధిస్తున్న స్కూళ్లలో ఈ కొత్త రూల్ ఎలా వర్తిస్తుందో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ALSO READ : వరంగల్ హైవేపై రాత్రుల్లో ఫ్యామిలీతో వెళ్తున్నారా.. ?

పైగా ఇప్పటికే కొత్త విద్యా సంవత్సరం (అకడమిక్ ఇయర్) మొదలైందని, పిల్లలు బుక్స్ కూడా కొనేశారని.. కాబట్టి ఈ ఏడాది చదువుతున్న విద్యార్థుల కోసం ఏదైనా తాత్కాలిక సడలింపు ఇవ్వాలని కోరింది.

ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి CBSE బోర్డుకు 15 రోజుల టైమ్ ఇచ్చింది. ఒకవేళ ఈ లోగా సరైన సమాధానం రాకపోతే హైకోర్టుకు వెళ్తామని ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్ హెచ్చరించింది.